హమారా ప్రసాద్ పై పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షించాలి

హమారా ప్రసాద్ పై పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షించాలి

అంబేద్కర్ సంఘం దళిత సంఘాల నాయకులు
మంగపేట,ఫిబ్రవరి 12 (విశ్వం న్యూస్) : సోషల్ మీడియా వేదికగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నీ గాడ్సేని కాల్చి చంపినట్లు చంపు తానంటూ అనుచితంగా మాట్లాడిన మనువాద మతోన్మాది హమారా ప్రసాద్ పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మాల మహానాడు దళిత సంఘాల నాయకులు మంగపేట మండల కేంద్రంలొ తెలంగాణ సెంటర్ దగ్గర దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దుర్మార్గ మైన దారుణమైన వ్యాఖ్యలు మరొకరు ఇలా మాట్లాడకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మనువాద మతోన్మాది హమారా ప్రసాద్ నిరంతరం తాను చేస్తున్న చిల్లర పనులకు తోడుగా వ్యక్తిగత పాపు లారిటీని పెంచుకోవడం కోసం రాజ్యాంగ నిర్మాత పైనే ఖండ కావరమెక్కి మాట్లాడటం దేశ ప్రతిష్టకే అవమానక రమని అన్నారు. ప్రజల మధ్య కుల మత విద్వేషాలను రెచ్చగొడుతూ వారి పై దేశ నాయకులను ఉపయోగించు కునే ఇలాంటి ఉన్మా దులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.అంబేద్కర్ బ్రతికి ఉంటే గాంధీని గాడ్సే కాల్చినట్లే నేను కూడా అంబేద్కర్ ని కాల్చి చంపేవాడినని బహిరంగంగా ప్రకటించడాన్ని ఉపేక్షించరాద న్నారు.ఇది జాతికి జరిగిన అవమాణంగా పరిగనించి ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో అంబెడ్కర్ సంగం నాయకులు బసరికాని హరి కృష్ణ, పగిడేపల్లి వెంకటేశ్వర్లు, అంబేద్కర్ విగ్రహాదాత చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, గoగేర్ల రాజారత్నం, రాజమల్ల సుకుమార్, నిమ్మగడ్డ ప్రవీణ్, పరికి శ్రీను, గుగిల్ల సురేష్, మైప లాలయ్య, ఎడ్ల నరేష్, ఎడ్ల శ్రీనువాస్, బోడ శ్రీను, బోడ బొర్రయ్య, కాస్ప ముకుందాం, బోడ రామచంద్రం, జై భీమ్ రాంమోహన్, ఈసంపెళ్లి సురేoదర్, చిక్కుల శ్రీకాంత్, చిట్యాల రాజశేఖర్, బోడ జయరాజు, బోడ శ్రీనివాసు, మేడిపల్లి శశి కుమార్, బోడ సతీష్, ఎల్పి కిరణ్, డోల్లి ప్రవీణ్, మొరం శ్రీనివాస్,డోలి విజయ శేఖర్, బoటు విశ్వనాథ, కూకట్ల శ్రీనివాస్, జానపట్ల జయరాజ్, జంగం బాను చందర్, దాసరి ఎల్లయ్య, దాసరి నరేష్, పాల్గొన్నారు.

అంబేద్కర్ అవమానపరిచిన వారిని శిక్షించాలని ఆందోళన చేస్తున్న దళిత సంఘాల నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *