ప్రజలే నా కుటుంబం: బల్మూరి వెంకట్

  • ప్రజలే నా కుటుంబం అంటూ హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బల్మూరి వెంకట్ పర్యటన

విశ్వం న్యూస్ ఆర్సి, జూన్ 3 (విశ్వం న్యూస్) : హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కమలాపూర్ మండలం పర్యటనలో భాగంగా
భీంపల్లి గ్రామంలో ఎండి తాజ్ కుమారుడు అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది, అదే గ్రామంలో పైసా రాజేష్- మమతల కుటుంబంలో జరుగుతున్న శుభకార్యంకి హాజరైనారు.

గూడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుమ్మరి ప్రశాంత్ – ఝాన్సీ ల వివాహం ఇటీవల జరిగినది వారి ఇంటికి వెళ్లి ఆశీర్వదించడం జరిగింది. అదే గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు కొండపాక మనీష్ తండ్రి బాలరాజు అనారోగ్యంగా ఉన్నారని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని పరామర్శించారు.

గునుపర్తి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఒడ్డే చంద్రమౌళి ఇటీవల మరణించడం జరిగిందని తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి మీకు అండగా ఉంటామని తెలిపారు.

గోపాల్పూర్ గ్రామానికి చెందిన చుక్కా అజయ్ శనిగరం గ్రామం వద్ద ఐదు నెలల క్రితం ఆక్సిడెంట్ లో మరణించాడని తెలిసి అతనికి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉండడంవల్ల, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా తరఫున 2,00,000 రూపాయల చెక్కును వారి తల్లి చుక్క రమ పేరు మీద చెక్కు అందజేసారు.

ఈ కార్యక్రమంలో కమలాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుండపు చరణ్ పటేల్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణ, కొండ రమేష్, ఆకనపల్లి బిక్షపతి, కొండ తిరుపతి, శ్రీనివాస్, నోమేష్, వీరన్న, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల రాజు, కుక్కల ఓదెల, అంజద్ పాషా, కొల్లూరి రాజన్, రామగిరి రవిచంద్ర, గుండారపు మధు యూత్ కాంగ్రెస్ నాయకులు కొండపాక మనీష్, కుక్కల కుమార్, అనిల్ ఎన్ ఎస్ యు ఐ నాయకులు హనుమాన్ ప్రసాద్, కొండ శివ తదితరులు
పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *