బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్..! కేసీఆర్ సంచలన నిర్ణయం

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విశ్వం న్యూస్) : బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై గులాబీ పార్టీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, సోమ భరత్ మంగళవారం ప్రకటన చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా—కవిత ఇటీవల మీడియా ముందు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌లపై కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీని అసౌకర్యంలోకి నెట్టాయి.
ఈ నేపథ్యంలోనే పార్టీ ఆదేశాల ప్రకారం కవితపై సస్పెన్షన్ వేటు వేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.