పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసు కేసు నమోదు…

పాడి కౌశిక్ రెడ్డిపై
పోలీసు కేసు నమోదు…

  • అధికార పార్టీ అండదండలతో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, అప్పుడు ఈ అధికారులకు చట్టప్రకారం గట్టి బుద్ధి చెబుతామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.

వీణవంక, జనవరి 30, 2026 (విశ్వం న్యూస్) : వీణవంక మండలంలో జరిగిన మినీ మేడారం సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా తనను, తన సతీమణిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూ అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. అధికార పార్టీ ఒత్తిడితో పోలీస్ యంత్రాంగం దుర్వినియోగమైందని ఆరోపిస్తూ స్పీకర్‌కు ప్రివిలైజ్ మోషన్ సమర్పించారు. భక్తి స్వేచ్ఛను కాలరాయడం, మహిళల గౌరవంపై దాడి చేయడం దారుణమని విమర్శించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, భవిష్యత్తులో చట్టప్రకారం గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

జాతర నిర్వహణపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిమిత వాహనాలనే అనుమతిస్తామని చెప్పారు. దీంతో కౌశిక్ రెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి, ఆయన భార్య, కూతురు, బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తమను అడ్డుకోవద్దని పోలీసులను కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని… తనను అడ్డుకుంటే సంగతి చెబుతానని బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డికి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు నాలుగు వాహనాలకు అనుమతిచ్చారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులో కలిసి వీణవంక వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *