రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్న పొన్నం, కవ్వంపల్లి

రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్న పొన్నం, కవ్వంపల్లి

కాంగ్రెస్ అసెంబ్లీకి.. బిఆర్ఎస్ ఇంటికి : పొన్నం ప్రభాకర్
నిఖార్సైన కాంగ్రెస్ వాళ్లు బి.ఆర్.ఎస్ బందిపోట్లతో కలవలేరు : కవ్వంపల్లి సత్యనారాయణ

కరీంనగర్, పిబ్రవరి 15 (విశ్వం న్యూస్) : రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రజలకు వివరిస్తూ టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు చేపడుతున్న హాథ్ సే హాథ్ జోడో “యాత్ర” పాలకుర్తి నియోజకవర్గంలో కొనసాగుతుండగా ఈ యాత్రలో నేడు కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి గారు మరియు చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం గారితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చేయి చేయి కలుపుతూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకమై సాగుతున్న ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను తెలియజేస్తూ బిజెపి, భారాసా ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇల్లు లేని పేదలకు 5లక్షల రూపాయలు ఇస్తామని, 500లకే సిలిండర్ అందజేస్తామని, ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామనే పలు అంశాలను వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *