హైవేపై గుంతలు … పట్టించుకోని అధికారులు

హైవేపై గుంతలు … పట్టించుకోని అధికారులు

గోవిందరావుపేట, డిసెంబర్ 28,(విశ్వం న్యూస్) : మండల పరిధిలోని పసర గ్రామ ప్రధాన కూడలిలో 163 జాతీయ రహదారి పై గుంటలు పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు పడిన సమీపంలో పలుమార్లు ప్రజలు ప్రమాదాలకు గురై తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ రహదారి నుండి పలువురు విఐపి అధికారులు ప్రయాణిస్తూ చోద్యం చూస్తున్నారు తప్ప పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ విషయంలో జాతీయ రహదారి అధికారులు వెంటనే జోక్యం చేసుకొని రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *