కాంగ్రెస్ అభ్యర్థి గణేష్‌కు అండగా నిలవాలని ప్రణవ్ పిలుపు

కాంగ్రెస్ అభ్యర్థి గణేష్‌కు అండగా
నిలవాలని ప్రణవ్ పిలుపు

శనిగరం, డిసెంబర్ 7 (విశ్వం న్యూస్) : కమలాపూర్ మండల పరిధిలోని శనిగరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బండి గణేష్‌కు గ్రామ ప్రజలు ఘనంగా మద్దతు ప్రకటించాలని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పిలుపునిచ్చారు.

ప్రణవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల్లో అమలు చేసిన అభివృద్ధి–సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పుని తీసుకొచ్చాయని చెప్పారు. రాబోయే మూడు సంవత్సరాల్లో ఇంకా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు.

గ్రామాభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ అభ్యర్థి బండి గణేష్‌ను సర్పంచ్‌గా భారీ మెజార్టీతో గెలిపించేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన సూచించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *