పిఆర్టియు-టిఎస్ కరీంనగర్
జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రతిభా
పురస్కార్ -2023 అవార్డు ప్రధానం
కరీంనగర్ బ్యూరో, మే 24 (విశ్వం న్యూస్) : ఏప్రిల్ 2023 ఎస్ఎస్సిలో 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, 10 జిపిఎ సాధించిన ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, మోడల్ స్కూల్ విద్యార్థులకు పిఆర్టియు. టిఎస్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 25 గురువారం రోజున ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రతిభా పురస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా PRTUTS పిఆర్టియు. టి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి, విశిష్ట అతిథులుగా సిహెహ్ జనార్దన్ రావు కరీంనగర్ జిల్లా విద్యాధికారి తదితరులు హాజరవుతున్నారని కరీంనగర్ జిల్లాలోని 16 మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు సీనియర్ కార్యకర్తలు, క్రియాశీల సంఘ సభ్యులు హాజరవుతూ మీ మీ మండలంలోని 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, 10జిపిఎ సాధించిన విద్యార్థులు హాజరయ్యేల కృషి చేయాలని జిల్లా శాఖ పక్షాన కోరుచున్నామని ముస్కు తిరుపతి రెడ్డి తెలిపారు.
ఈకార్య క్రమంలో మర్రి జైపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ పతాకక సంపాదక వర్గ సభ్యులు జాతి మహేందర్ రెడ్డి, జిల్లా అసోషిమేట్ అద్యక్షులు అన్నాడి మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉపాద్యక్షులు లక్ష్మినారాయణ , జిల్లా ఉపాద్యార్థులు మీరు పెళ్లి తిరుపతి, వీణవంక మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, పాల్గొన్నారు.