రామప్ప దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

రామప్ప దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

వెంకటాపురం (రామప్ప) డిసెంబర్ 28, (విశ్వం న్యూస్) : శీతాకాలం విడిదీలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము బుధవారం వెంకటాపురం మండలం రామప్ప దేవాలయాన్ని సందర్శించుకున్నారు .ఈ సందర్భంగా ఆమెకు రామప్ప అర్చకులు మరియు గవర్నర్ సౌందర రాజన్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే సీతక్క కలెక్టర్ కృష్ణ ఆదిత్య తదితరులు సంప్రదాయ పద్ధతిలో గణ స్వాగతం పలికారు . అనంతరం జాతీయగీతం ఆలపించారు .ఈ సందర్భంగా కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు మూడు అంచల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామప్పలో రాష్ట్రపతి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *