పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ కు
పిఆర్టియూ సంఘం ఎల్లప్పుడూ
అండగా ఉంటుంది
పి ఆర్ టి యు రాష్ట్ర సంఘం
నాయకులకు ఘనంగా సన్మానం
హైదరాబాద్, జూన్ 19 (విశ్వం న్యూస్) : పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ (పీటీఐ)లకు తగిన సమయంలో రీ ఎంగేజ్మెంట్ ఆర్డర్స్ ఇప్పించి 2300 మంది కుటుంబాలకు అండగా నిలిచి అన్నం పెట్టినందుకు గాను సోమవారం తెలంగాణ కళా వృత్తి వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కమటీ, జిల్లా బాధ్యుల ఆధ్వర్యంలో పిఆర్ టియు రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావుకి,ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ లను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పీఆర్టియూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ పీ ఆర్ టీ యు సంఘం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని తెలియచేశారు.
పీటీఐ సభ్యుల సమస్యలను పి ఆర్ టి యు సంఘం తప్పకుండా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ కళా వృత్తి వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి మద్దిమడుగు, రాష్ట్ర ప్రధనకార్యదర్శి రయీస్ ఫాతీమ, రాష్ట్ర కోశాధికారి గడ్డం శ్రీను, రాష్ట్ర ఉపాధ్యక్షులు పీర్ సింగ్, జ్యోతి, రాష్ట్ర సహాయ కోశాధికారి గిరీష్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మహేంద్ర చారి, రాష్ట్ర ఆడిటర్ ఉదయ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ వివిధ జిల్లాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు శైలజ,సంతోష్, వాహిద్, వెంకన్న, వెంకటేశం, మహమూద్ పాషా, సత్యనారాయణ, మహబూబ్, శంష తదితరులు హాజరయ్యారు.