వీణవంక:ఇరు కుటుంబాల
మధ్య గొడవ గొడ్డలితో దాడి

వీణవంక, జూలై 6 (విశ్వం న్యూస్) : భూ తగదల్లో ఇరు కుటుంబాల మధ్య గొడవ గొడ్డలితో దాడి వివరాల్లోకి వెళ్తే వీణవంక మండలం శ్రీరాముల పేట గ్రామానికి చెందిన చుక్కల బుచ్చయ్యను అతని అన్న అయిన చుక్కల వెంకటయ్య, చుక్కల మల్లమ్మ, చుక్కల శ్రీనివాస్, చుక్కల మాధవి లు వారి ఇంటి జాగా గొడవను దృష్టిలో ఉంచుకొని గురువారం రోజున చుక్కల బుచ్చయ్య తన వ్యవసాయ భూమి నుండి ఇంటికి వెళ్తుండగా దారి మార్గంలో చుక్కల బుచ్చయ్యను విపరీతమైన బూతులు తిడుతూ శ్రీనివాస్ వెనుక నుండి బుచ్చయ్యను గొడ్డలితో దాడి చేయగా తీవ్రమైన రక్త గాయం అయింది.
బుచ్చయ్య అల్లుడు జక్కుల శ్రీనివాస్ ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కే.శేఖర్ రెడ్డి తెలిపారు.