హాస్పిటల్‌లో రష్మీ.. ఏమైంది?

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విశ్వం న్యూస్) : హైదరాబాద్: ప్రముఖ టెలివిజన్ యాంకర్ రష్మీ గౌతమ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇటీవల ఆమె స్వయంగా వెల్లడించిన విషయం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. జనవరి నుండి తీవ్ర రక్తస్రావం, భుజం నొప్పితో బాధపడుతున్న రష్మీ, గత వారం రోజుల్లో హిమోగ్లోబిన్ స్థాయి 9కి పడిపోవడంతో సర్జరీకు పాల్పడాల్సి వచ్చింది.
రష్మీ ఇటీవల ఆస్పత్రిలో తను వేసుకున్న ఆపరేషన్ గౌన్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఏప్రిల్ 18న సర్జరీ జరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం తాను మెరుగవుతున్నానని, ఇంకా మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ సమయంలో తనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
తనకు ఏం జరుగుతుందో మొదట్లో అర్థం కాక, వైద్యులను సంప్రదించాకే అసలు సమస్య గమనించానని రష్మీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అభిమానులంతా ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇక ఇటీవల రష్మీ గౌతమ్ హెచ్‌సీయూ భూవివాదంపై స్పందించిన విషయం కూడా గుర్తు చేసుకోదగ్గది. ప్రకృతి పరిరక్షణకోసం ప్రభుత్వాన్ని కోరుతూ ఆమె విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంది.