ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి

ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి

  • బోధన్‌ బోగస్‌ చలాన్ల కేసులో సస్పెండ్ అయిన వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి
  • తెలంగాణ టిసిటిఎన్జీవో సంఘ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం సిఎస్ రెవిన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ డాక్టర్ టీ. కె శ్రీదేవీ కు విజ్ఞప్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 23(విశ్వం న్యూస్) : బోధన్‌ బోగస్‌ చలాన్ల కేసులో సస్పెండ్ లో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మరియు ఉద్యోగులను వెంటనే వాణిజ్య పనుల శాఖలో విధులలో తీసుకోవాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ లకు విజ్ఞప్తి చేశారు.

రైస్ మిల్ యజమానులు వారి యొక్క ఆడిటర్ యొక్క లాలూచీ వలన జరిగిన బోధన్‌ బోగస్‌ చలాన్ల కేసులో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మరియు ఉద్యోగులు 40 రోజులు జైలు జీవితం కరీంనగర్లో గడిపారు. వారిని తిరిగి ఉద్యోగాలలో తీసుకోవాలని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారిని, వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని తిరిగి విధులలో తీసుకోవాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *