రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి-ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి-ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి

గోవిందరావుపేట, డిసెంబర్ 30 (విశ్వం న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు నిధులు కేటాయించి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పసర కొండ్రెడ్డి చెన్నారెడ్డి గార్డెన్లో మండలం రెడ్డి సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ శ్రీనివాసరెడ్డి హాజరై క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే ప్రభుత్వం హామీలు పేర్కొన్న విధంగా రెడ్డి సంక్షేమం కొరకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు నిధులు కూడా కేటాయించి అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. మండలంలో కూడా తన వంతు పరంగా రెడ్డి సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ,గౌరవ అధ్యక్షులు యానాల వెంకట్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి అంతి రెడ్డి సత్యనారాయణ రెడ్డి,కోశాధికారి చింతల్ లింగారెడ్డి,మహిళ కమిటీ అధ్యక్షురాలు మేడ ఆదిలక్ష్మి ఉపాధ్యక్షులు యాస పూలమ్మ కార్యదర్శి గోలి వినోద ,సామ కవిత, సామ సరోజన పుల్యాల రజిని బద్దం విజయలక్ష్మి అంతి రెడ్డి రమాదేవి,మిర్యాల యాదగిరి రెడ్డి,కొత్త సుధాకర్ రెడ్డి,బొబ్బ సత్తిరెడ్డి,కట్ల జనార్దన్ రెడ్డి,పింగళి జైపాల్ రెడ్డి,ఏనుగు శేఖర్ రెడ్డి,బురెడ్డి మధుసూదన్ రెడ్డి,బేతి ప్రభాకర్ రెడ్డి,కట్కూరి భగవాన్ రెడ్డి,ఏపూరు మల్లారెడ్డి,పాడాల మల్లారెడ్డి వేణు రవీందర్ రెడ్డి కర్ర సాంబశివరెడ్డి, బద్దం లింగారెడ్డి,కొండ్రెడ్డి రాజేందర్ రెడ్డి కోమటిరెడ్డి సమ్మిరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న రెడ్డి సంఘం నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *