బండ్లగూడ వార్డ్ 123లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

హైదరాబాద్, జనవరి 26, 2026 (విశ్వం న్యూస్) : బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని వార్డ్ నెంబర్ 123లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూలపల్లి కృష్ణారెడ్డి, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ తలారి ప్రేమ్ కుమార్, కొరివి గణేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
విద్యానగర్ అసోసియేషన్, సంఘమిత్ర స్కూల్, వెంకటేష్ నగర్ కాలనీ, బృందావన్ కాలనీ, J NRMతో పాటు పలు కాలనీల్లో రిపబ్లిక్ డే వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి. దేశభక్తి నినాదాలతో కాలనీలు మార్మోగగా, జాతీయ గీతాలాపనతో కార్యక్రమాలు ముగిశాయి.
ఈ సందర్భంగా వివిధ కాలనీల అసోసియేషన్ ప్రెసిడెంట్లు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను గుర్తు చేసుకున్నారు. ఐక్యత, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిదేనని వక్తలు పేర్కొన్నారు.