రేవంత్ ప్రతిష్టిస్తోంది..
తెలంగాణ తల్లినా..!
కాంగ్రెస్ తల్లినా..!!
హైదరాబాద్, డిసెంబర్ 7 (విశ్వం న్యూస్) : ”ఆహ్వానం మాకు మ్యాటర్ కాదు.. తెలంగాణ తల్లి మాకు మ్యాటర్” అని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కార్యక్రమం కాదన్నారు. లగచర్ల, గురుకులాలు, వ్యవసాయ సంక్షోభం, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తామని తెలిపారు. అసెంబ్లీ, మండలి సమావేశాలు కనీసం నెలరోజులు నడపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినపుడల్లా గత ప్రభుత్వం నిర్ణయాలు మారాలా అని నిలదీశారు.
ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన భారతమాత రూపాన్ని వాజపేయి మార్చలేదన్నారు. నాలుగేళ్ళ తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి నోటికి హద్దు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్ ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నారన్నారు. రేవంత్ చెప్తే.. కేసీఆర్ నేర్చుకోవాల్సిన పరిస్థితిలో లేరన్నారు. మర్యాద.. రేవంత్ అడ్టుకుంటే రాదని.. ఇచ్చుపుచ్చుకోవాలని హితవుపలికారు. కేసీఆర్‌ను గౌరవిస్తేనే.. రేవంత్ రెడ్డిని, ఆయన కుర్చీని గౌరవిస్తామన్నారు.
125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రేవంత్ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. హైకమాండ్ నుంచి వచ్చిన డైరెక్షన్‌తోనే అంబేద్కర్, పీవీ విగ్రహాలను రేవంత్ పట్టించుకోవటం లేదని విమర్శించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం సందర్శనకు అవకాశం ఉందన్నారు. 125అడుగుల విగ్రహాం సందర్శనకు అవకాశం ఇవ్వకుండా.. తాళాలు వేసి అపరిశుభ్రంగా తయారుచేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతామంటే పోలీసులతో అడ్డుకుంటున్నారన్నారు.
”గురుకుల విద్యార్థులను మేము ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిస్తే.. రేవంత్ పాడెను ఎక్కిస్తున్నారు” అంటూ విమర్శించారు. యూపీలో తిరగనివ్వటం లేదని మొత్తుకుంటోన్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జన్సీనే నడుస్తోంది అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
- తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయ వివాదం నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న విగ్రహం రూపాన్ని మారుస్తూ.. కొత్త విగ్రహాన్ని ఈనెల9వ తేదీన ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య కొద్దిరోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని దొరసానిలా రూపొందించారని కాంగ్రెస్ విమర్శిస్తుంటే.. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, దీనిలో భాగంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఓ సాధారణ మహిళలా తెలంగాణ తల్లిని రూపొందిస్తున్నామని కాంగ్రెస్ చెబుతుండగా.. తెలంగాణ తల్లి రూపం ధనిక మహిళగా ఉంటే వచ్చే నష్టం ఏమిటని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది. మరో మూడు రోజుల్లో కొత్త తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో కొత్త విగ్రహానికి సంబంధించిన రూపం బయటకు వచ్చింది. ఓ సాధారణ మహిళను తలపించేలా విగ్రహం ఉండగా.. గత విగ్రహానికి ప్రస్తుత విగ్రహానికి పోలికల్లో ఎన్నో తేడాలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహం రూపాలను మార్చడం సరికాదని బీజేపీ అంటోంది. ఇటీవల తెలంగాణ గేయం విషయంలోనూ వివాదం నెలకొన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పాత గేయం స్థానంలో కొత్త గేయాన్ని తీసుకొచ్చింది. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం గత రూపాన్ని మారుస్తూ ఓ సాధారణ మహిళ రూపాన్ని తలపించేలా కొత్త రూపాన్ని రూపొందించింది.
- అప్పటికీ.. ఇప్పటికీ తేడాలివే..!!
- పాత తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ తల్లి జరీ అంచు పట్టు చీర ధరించగా.. కొత్త విగ్రహంలో పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ధరించి ఉంది. పాత విగ్రహంలో తలకు కిరీటం, చేతిలో బతుకమ్మ ఉండగా.. కొత్త విగ్రహంలో కిరీటం, చేతిలో బతుకమ్మ లేదు. గత విగ్రహంలో తెలంగాణ తల్లి చేతికి బంగారు గాజులు ఉండగా, ప్రస్తుతం మట్టి గాజులు ధరించి తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తోంది. గత విగ్రహం రాజమాతలా ఉందనే విమర్శలు రాగా.. కొత్త విగ్రహం సాధారణ మహిళ రూపాన్ని తలపిస్తోంది. పాత విగ్రహంలో వెండి మెట్టెలు, నగలు కిరీటం ఉండగా.. కొత్త విగ్రహంలో మెడలో కంటి ఆభరణం మాత్రమే కనిపిస్తోంది. పాత విగ్రహంలో కుడి చేతిలో మక్క కంకులు ఉండగా.. కొత్త విగ్రహం కుడి చేతిలో అభయ హస్తం కనిపిస్తోంది. పాత విగ్రహంలో ఎడమ చేతిలో బతుకమ్మ ఉండగా.. కొత్తవిగ్రహంలో ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. రెండు విగ్రహాల రూపాలకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది.