జాగోరే జాగో కదిలిందిర జనసేన

హైదరాబాద్, జూలై 9 (విశ్వం న్యూస్) : జనసేన పార్టీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాటకు బుర్రా సతీష్ లిరిక్స్ అందించగా.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అయితే మొదటి నుంచి తెలంగాణ ప్రాంతమంటే అభిమానం కురిపించే పవన్ కళ్యాణ్.. ఈ సాంగ్‌ను సైతం ప్రత్యేకంగా ప్రముఖ తెలంగాణ సింగర్స్ మధు ప్రియ, నల్లగొంగ గద్దర్‌తో పాడించారు. నిజానికి కూడా జనాల ఆర్తిని వివరించాలంటే అది పల్లె గొంతుకలకే సాధ్యం. సినిమా సింగర్స్‌లో అలాంటి నైపుణ్యం అంతగా ఉండదనే చెప్పొచ్చు. ఈ పాట విన్న తర్వాత ఎవరైనా సరే అదే విషయాన్ని ఒప్పుకుంటారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే పెద్ద ఎత్తున దీనిని వీక్షిస్తుండడం విశేషం. వ్యూస్ కూడా భారీ స్థాయిలో పెరిగాయి.