శ్రీరేణుక ఎల్లమ్మ ఉత్సవాల రూట్ మ్యాప్
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 20 (విశ్వం న్యూస్) : గురువారం రోజు శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి బోనాల ఉత్సవాల ఏర్పట్ల గురించి మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయం ఆవరణలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పోచమ్మ బోనాలు నుంచి ఎల్లమ్మ బోనాలు ముగిసే వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలని సమీక్ష సమావేశం చేయడం జరిగింది. ఈ నెల 25న రాంనగర్ నుండి బోనాలు సాయంత్రం 6.00 గంటలకు మొదలవుతాయని రాంనగర్, మంకమ్మ తోట నుండి టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చిన తరవాత తెలంగాణ చౌకు లో మొదటి స్టేజి ఏర్పాటు చేయడం జరుగుతుందని అక్కడ వీఐపీలకు సన్మాన కార్యక్రమం జరుపబడును. అక్కడ నుండి బస్టాండ్ మీదుగా వన్ టౌన్ చౌరస్తా వరకు అన్ని బోనాలు కలిపి కమాన్ ఏరియాలో వచ్చిన తర్వాత మిగతా ఏరియాల నుంచి వచ్చిన బోనాలు కమన్ చౌరస్తా దగ్గర కలువ వలసి ఉంటుందని కమాన్ చౌరస్తాలో రెడవ స్టేజి ఉంటుంది. ఇక్కడ సాంస్కృతి కార్యక్రమాలు , వీఐపీలకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది.
వివిధ ఏరియాల నుండి వచ్చిన బోనాలను కలుపుకొని కమాన్ చౌరస్తా నుండి బయలుదేరి కోతి రాంపూర్ మీదుగా కరీంనగర్ బైపాస్ నుండి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయం వరకు మన బోనాల జాతర రూట్ మ్యాప్ ప్రకారం వెల్ల వలసి ఉంటుంది. 23 వ తేదీన ఆదివారం పోచమ్మ తల్లి బోనాలు ఉదయం 9గంటలకు మొదలవుతాయని ఆలయ ప్రాంగణంలో 25వ తేదీన దాదాపు 5 వేల మంది కి బోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బోనాలు బయలు దేరిన సమయాలలో బోనాలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చినాయని సమాచారం తెలియజేస్తే ముందుకు సాగడం జరుగుతుందని ఈ బోనాల శోభయాత్రలో బాణాసంచా పేల్చడం లేదని వాటిని నిషేధించడం అయినదని ఎవరు కూడా బాణాసంచ పేల్చకూడదని గౌడ సంఘం నిర్ణయించడం జరిగింది.
డీజేలకు పర్మిషన్ లేనందున ఈ బోనాల జాతర శోభయాత్రకు ప్రతి ఒక్కరు సహకరించి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడూరి సత్యనారాయణ గౌడ్, తాళ్లపల్లి హరికుమార్ గౌడ్, పంజాల సురేందర్ గౌడ్, మాచర్ల ప్రసాద్, గౌడ్ కోడూరి హరికృష్ణ గౌడ్, కోడూరి మహేందర్ గౌడ్ (అడ్వకేట్), కోడూరి లక్ష్మణ్ గౌడ్, బుర్ర పరశురాం గౌడ్, బత్తిని కిషోర్ గౌడ్, బత్తిని సత్యం, బత్తిని రాజు గౌడ్, న్యాలం అంజయ్య, వొల్లాల శ్రీనివాస్, నాగుల కిరణ్ గౌడ్ గౌడ సంఘం నాయకులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయం నిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్ తెలిపారు.