జమాల్ ఖాన్ ను
సన్మానించిన ఆర్పీ
- మానసిక రుగ్మతలను రూపుమాపే శక్తి సామర్థ్యాలు సంగీతంతోనే సాధ్యం
భద్రాచలం, జనవరి 27 (విశ్వం న్యూస్) : ప్రముఖ సంగీత దర్శకులు గాయకులు అయినటువంటి ఆర్పి పట్నాయక్ ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ను హైదరాబాద్ లో తమ నివాసానికి ఆహ్వానించి సన్మానించి ఆతిథ్యం ఇచ్చినారు. ఆర్పి పట్నాయక్ కుటుంబ సభ్యులు తో కలిసి జమాల్ ఖాన్ కొన్ని గంటల పాటు గడిపినారు. ఆయుర్వేదంలో తాను చేస్తున్న సేవలకు గాను ప్రజలు నేడు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఇస్తున్నారని డబ్బుతో కొనలేనిది మంచి మనసుతో పొందవచ్చని ప్రేమాభిమానాలు ప్రజల్లో నుండి వస్తాయని తాము చేస్తున్న మంచి పనులను ప్రతి ఒక్కరు గుర్తిస్తారని ఈ సందర్భంగా ఆయన సంభాషించారు.
మంచి సంగీతంతో కూడా కొన్ని రకాల మానసిక రుగ్మతలను రూపుమాపే శక్తి సంగీతానికి ఉందని మనసులను కదిలించే మహత్తర మైన సంజీవని పాటల్లో దాగి ఉందని చైతన్యాన్ని ఉత్సాహాన్ని పోరాటాన్ని కలబోసి పాడిన పాటలు నేడు ఎంతోమంది మనసులను కదిలించేలా ఉన్నాయని కేవలం మందులతోనే కాకుండా మానసిక చికిత్స కూడా మనుషుల రుగ్మతలను తగ్గించేలా ఉంటాయన్నారు. ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ ఆహ్వానించిన మరుక్షణమే తమ నివాసానికి వచ్చినందుకు ఆతిథ్యం స్వీకరించినందుకుగాను ఆర్పి పట్నాయక్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.