ఘనంగా గణేశా వందనం

- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విశ్వం న్యూస్) :శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వెలిసిన గణనాధునికి ఏడవ రోజు ఆలయ కమిటీ సౌజన్యంతో స్నేహితం ట్రస్ట్ చైర్పర్సన్ చింతపల్లి శోబ్బారెడ్డి ఆధ్వర్యంలో గణేశ వందనం, భరతనాట్యం కార్యక్రమాన్ని డా. గూడూరి చెన్నారెడ్డి ఆలయ కమిటీ ప్రెసిడెంట్, జి శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్, బి.కె. జి విజయలక్ష్మి, పెద్దూరు వెంకట దాస్, జి. మహేందర్ రెడ్డి యూత్ ప్రెసిడెంట్ విచ్చేసిన అతిధుల సమక్షంలో దీపారాధన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నాట్య గురువైన జయకవి గౌతమ్ స్వయానా గణేశా వందనం నృత్య రూపంలో ప్రదర్శించి ప్రేక్షకులను ఆనందోత్సవంలో ముంచెత్తారు. తదుపరి తనశిష్య బృందంచే భరతనాట్య కార్యక్రమం ప్రోగ్రాం హైలైట్ గా నిలిచింది. నాట్య గురువుకి శాలువాతో పాటు మెమెంటో ఇచ్చి సన్మానం చేసి వారి శిష్య బృందానికి కూడా మెమొంటోలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కోశాధికారి డి.రవి గౌడ్, జి. శ్రీధర్ రెడ్డి, బేబీ జి.తరుణి రెడ్డి, నగేష్, గోపి, సింగర్ శ్రీనివాస్ వారి సతీమణి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.