మృతి చెందిన కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేసిన సర్పంచ్ నీల కుమార స్వామి

వీణవంక:మృతి చెందిన
కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేసిన
సర్పంచ్ నీల కుమార స్వామి

  • ఇటీవల మృతి చెందిన 9 కుటుంబాలకు 27000 వేల రూపాయల ఆర్థిక సాయం అందించిన సర్పంచ్ నీల కుమార స్వామి

వీణవంక, జూన్ 21 (విశ్వం న్యూస్) : వీణవంక గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన సర్పంచ్ నీల కుమారస్వామి. బుధవారం వారి కుటుంబ సభ్యులను మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ప్రతి కుటుంబానికి 3000 రూపాయల ఆర్థిక సాయం చొప్పున మొత్తం 9 కుటుంబాలకు 27000 వేల రూపాయలను ఆర్థిక సాయం అందించారు.

మృతులు పులాల వీరస్వామి, దాసారపు రాయమల్లు, దాసారపు పోచయ్య (స్టాలిన్), దాసారపు రాజ వీరు, దాసారపు లింగమ్మ, రెడ్డిరాజుల రాజయ్య, లోకిని రాజమ్మ, రాచర్ల మొగిలి, చింతల రంజిత్-రజితల కుటుంబాలకు అందించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మహేష్ గౌడ్, వార్డ్ మెంబర్లు నీల లక్ష్మీ మొండయ్య, రాయిశెట్టి సరిత సంపత్, బిక్షపతి, మోటం రాజు, కృష్ణ చైతన్య, గొడుగు రాజు, నాయకులు వోరెం క్రాంతి, వోరేం శ్రీనివాస్, వోరెం మధు, లింగయ్య,రెడ్డి రాజుల రవి, రాజేందర్, ఓదెలు, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *