బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
అందజేసిన సర్పంచ్ నీల కుమారస్వామి
వీణవంక, జూన్ 12 (విశ్వం న్యూస్) : వీణవంక మండల కేంద్రానికి చెందిన గంట కొమురయ్య అనారోగ్యంతో మృతి చెందగా సమాచారం తెలుసుకున్న సర్పంచ్ నీల కుమారస్వామి మృతుని పార్థివ దేహం వద్ద నివాళులర్పించిన మృతి గల కారణాలు వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు 3000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. అలాగే ఇటీవల మృతి చెందిన గంట కనకయ్య కుటుంబ సభ్యులకు 3000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు.
సర్పంచ్ గా గెలుపొందిన నుండి గ్రామంలో నిరుపేద కుటుంబాలకు చెందిన వివిధ కారణాలతో మృతిచెందగా కుటుంబాలకు మూడు వేల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. వీరి వెంట వార్డ్ మెంబర్ బీ ఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్ల పెళ్లి మహేష్ గౌడ్, నీల లక్ష్మి మొండయ్య, గొడుగు రాజు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వోరెం శ్రీనివాస్, వోరెం క్రాంతి, వోరెం పూర్ణచందర్ తదితరులు ఉన్నారు.