
హైదరాబాద్, డిసెంబర్ 29 (విశ్వం న్యూస్) : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో.. ఈ ఘటనపై సెటైరికల్‌గా ఒక ప్రైవట్ పాట రిలీజైంది. “టిక్కెట్‌లు మేమే కొనాలి.. సప్పట్లు మీకే కొట్టాలి. సావులు మేమే చూడాలి.. సల్లంగా మీరే ఉండాలి” అంటూ సాగే ఈ పాట అల్లు అర్జున్ ఘటన చుట్టునే తిరుగుతుంది.
ఇక ఈ పాటలో బన్నీ మ్యానరిజం, పుష్ప రాజ్ స్టైల్‌ను ఫాలో అయ్యారు. ఆడియెన్స్ అంటే ప్రేమ ఉన్నట్టు.. ఫ్యాన్స్ అంటే ప్రాణం అన్నట్టుగా బిల్డప్ ఇస్తారట.. లోలోపల మాత్రం తిట్టుకుంటారట.. బౌన్సర్లను పెట్టి ఆడియెన్స్ మీద బలుపు చూపిస్తారట. ఇలా ఆ పాట ఆద్యంతం బన్నీ మీద, హీరోల మీద, ఇండస్ట్రీ మీద సెటైర్ వేసినట్టుగానే ఉంది. మరి ఇలాంటి పాటలే గురుకుల పాఠశాలలో చనిపోయిన విద్యార్థుల మీద కూడా రాయొచ్చు కదా అని కౌంటర్లు వేస్తున్నారు.