పవన్ కోసం ప్రత్యేక కార్యాలయం ఎంపిక

పవన్ కోసం ప్రత్యేక
కార్యాలయం ఎంపిక

ఆంధ్రప్రదేశ్, జూన్ 16 (విశ్వం న్యూస్) : ఏపీ ఉపముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే పవన్ కోరుకున్న విధంగా శాఖలు దక్కాయి. తన మనసుకు నచ్చిన శాఖలను నిర్వహిస్తున్నానని పవన్ చెప్పుకొచ్చారు. కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించిన పవన్ కు ప్రతీ అంశంలోనూ చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదా పవన్ కు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు పవన్ విధుల నిర్వహణ కోసం కార్యాలయం విషయంలోనూ చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు.

పవన్ కార్యాలయం
ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, అటవీ, పర్యావరణం, శాస్త్రసాంకేతిక శాఖల్ని నిర్వహించనున్నారు. సీఎం తర్వాత ఎక్కువ శాఖలు పవన్ కల్యాణ్ వద్ద ఉండటంతో ఆయనకు సచివాయలంలో కేటాయించే కార్యాలయంపై చంద్రబాబు ఆరా తీసారు.

దీని పైన కీలక సూచనలు చేసారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే బ్లాక్ -1 లోనే పవన్ కు పెద్ద చాంబర్ ను సిద్దం చేయాలని సూచించారు. దీంతో..పవన్ పేషీలో పని చేసే ఓఎస్డీలు, సెక్రటరీలు, ఇతర అధికారులకు అనుకూలంగా ఉండేలా ఛాంబర్ సిద్ధమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *