సీనియర్ ఐపీఎస్ అధికారి
రాజీవ్ రతన్ కన్నుమూత..
సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విశ్వం న్యూస్) : సీనియర్ ఐపీఎస్ అధికారి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ మృతిచెందారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. రాజీవ్ రతన్కు మంగళవారం ఉదయం ఛాతి నొప్పి రావడంతో ఆయనను ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజీవ్ రతన్ కన్నుమూశారు. సీనియర్ ఐపీఎస్అ ధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైష్ట న సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదని అన్నారు.