‘ఒరేయ్ మనోజ్.. గుండెల మీద తన్నావ్ కదరా’ అంటూ మోహన్ బాబు సంచలన ఆడియో
హైదరాబాద్, డిసెంబర్ 12 (విశ్వం న్యూస్) : నిన్ను ఎలా పెంచునురా.. బిడ్డలు గుండెల్లో తన్నిన్నటు తన్నావు. ప్రతి ఫ్యామిలీ లో గొడవలు ఉంటాయి. నీకు అన్నీ ఇచ్చినా, నాకు ఆపకీర్తి తెచ్చావ్. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావ్. నువ్వు, నీ భార్య చేస్తుంది భగవంతుడు చూస్తున్నాడు.
ఇంట్లో ఉన్న పని వాళ్లను ఎందుకు కొడుతున్నావ్. మూడు రోజులు నుంచి జరుగుతుంది చూడు. మీ అన్న కష్టపడి యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నాడు. మీ అన్నను కొడతావ్, తిడతావ్. మీ అన్నను చంపుతా అన్నావ్. ఈ ఇంట్లోకి అడుగు పెట్టే అర్హత లేదు” అని మంచు మోహన్ బాబు ఆడియోలో తెలిపారు.
“నిన్ను ఎలా పెంచానురా నేను.. అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను.. నీకే ఎక్కువ ఖర్చుపెట్టి చదివించాలనుకున్నాను..
నువ్వు ఏది అడిగినా నీకిచ్చాను.. కానీ నువ్వు ఈరోజు చెస్తున్న పని బిడ్డలు గుండెల మీద తంతారంటారే.. అలా తన్నావురా.. మనసు ఆవేదనతో కృంగిపోతుందిరా..
నేను నీ తల్లి ఏడుస్తున్నాంరా.. నా బిడ్డ నన్ను కొట్టడం ఏంటిరా? నా బిడ్డ నన్ను తాకలా.. ఇద్దరం ఘర్షణ పడ్టాం.. కొన్ని కారణాల వల్ల.. ప్రతి ఫ్యామిలీ లోనూ ఉంటాయిరా ఇవి.. అలాంటి ఫ్యామిలీ లేదంటే వారి కాళ్లు కడగొచ్చు. భారత భాగవత రామాయణాలు చూసావ్ కదరా..” అని మోహన్ బాబు అన్నారు.