మహిళలకు కుట్టుమిషన్ల శిక్షణ,
సేంద్రీయ ఎరువుల పంపిణీ

- CRPF 212 అధ్వర్యంలో…..

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 27 (విశ్వం న్యూస్) : చతిస్గడ్ సుకుమార్ జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో దబ్బ మరక అటవీ ప్రాంతంలో 212 వ బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆదివాసీలను ఆహ్వానించి పండ్లు ఫలహారాలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు బట్టలు, వ్యవసాయ సేంద్రియ విత్తనాలు పంపిణీ చేశారు. ప్రత్యేకంగా ఈ బెటాలియంలో స్థానిక ఆదివాసి మహిళలకు కుట్టు మిషన్ తరగతులు, విద్యార్థిని విద్యార్థులకు కంప్యూటర్ విద్య శిక్షణ కేంద్రాన్ని 212 బెటాలియన్ కమాండర్ దీపక్ కుమార్, అసిస్టెంట్ కమాండర్ మనోజ్ కుమార్ పాండే ప్రారంభించారు.

అంతేకాకుండా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమాండెడ్ దీపక్ కుమార్ మాట్లాడుతూ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆయన ఆదివాసీలకు తెలిపారు. సామాన్య ప్రజలకు పోలీసులకు మధ్య స్నేహపూర్వక సత్సంబంధాలు ఉండేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.

ఆదివాసులందరూ అభివృద్ధి చెందాలని 212వ బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో ఎవరి మీద ఆధారపడకుండా స్వయంకృషితో జీవించే విధంగా మహిళలకు టైలరింగ్ తరగతులు ఈ బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో నేర్పుతామని, అంతేకాకుండా రేపటి పౌరులకు కంప్యూటర్ విద్యా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించమన్నారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండర్ దీపక్ కుమార్, అసిస్టెంట్ కమాండర్ మనోజ్ కుమార్ పాండే, సైనికులు ఆదివాసీలు పాల్గొన్నారు.