ముస్లిం బంధు పెట్టాలే…

ముస్లిం బంధు పెట్టాలే…

  • కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మజీద్ ఈద్గా ఖబరుస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 11 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు అన్ని వర్గాల కంటే వెనుకబడి ఉన్నారు. ముస్లిం మైనార్టీ వర్గాలపై గతంలో కేంద్ర ప్రభుత్వం సచార్ కమిటీ మరియు జస్టిస్ రంగనాథ్ మిశ్రా ఇలాంటి ఎన్నో కమిటీలు మైనార్టీ ముస్లిం వర్గాలపై అనేక సర్వేలు జరిపించి కేంద్ర ప్రభుత్వం అప్పట్లో భారతదేశం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పేరు మీద భారతదేశంలో ఉన్న ముస్లిం మైనార్టీ వర్గాలకు చదువుకోడానికి ఆర్థిక పరిస్థితి బాగోలేక అప్పుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పేరుతో స్కాలర్షిప్లను కేంద్ర ప్రభుత్వం అమలుపరచింది.

యూపీఐ గవర్నమెంటు అప్పటినుండి నిరుపేద ముస్లిం మైనార్టీ వర్గాలలో విద్యార్థి విద్యార్థినిలు చదువుకోవడానికి ముందుకు వచ్చినారు అలాంటి సమయంలో కొన్ని రాష్ట్రాలలో ముస్లిం మైనార్టీ వర్గాలను దృష్టిలో పెట్టుకొని ముస్లిం మైనార్టీలు చదువులలో ఉద్యోగాలలో వెనుకబడి ఉన్నారని తెలుసుకొని కొన్ని రాష్ట్రాలలో ముస్లింల భవిష్యత్తు చక్కదిద్దడానికి ఆయా రాష్ట్రాల్లో ముస్లిం మైనార్టీ వర్గాలకు విద్య ఉద్యోగాలలో నాలుగు శాతం రిజర్వేషన్లు అమలుపరచడం జరిగింది అప్పటినుండి కొన్ని రాష్ట్రాలలో ముస్లిం విద్యార్థి విద్యార్థినులు చదువుకోవడానికి ముందుకు కదలడం జరిగింది.

ఉన్నంత స్థాయి చదువులు చదువుకున్నా వారికి ఆ రాష్ట్రాల్లో ఏదైనా ప్రభుత్వం ద్వారా నోటిఫికేషన్ వేసినప్పుడు అక్కడి ప్రభుత్వం 100కు నలుగురు చొప్పున ఉద్యోగాలు ఇవ్వడానికి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు కొనసాగింది అలాంటి తరాణంలో ఇప్పుడు కొనసాగుతున్న బిజెపి పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ముస్లిం మైనార్టీ వర్గాల కొరకు అమలుపరుస్తున్న భారతదేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి కీర్తిశేషులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పేరుతో ఇస్తున్న స్కాలర్షిప్లను కూడా రద్దు చేయడం జరిగింది. మళ్లీ గత కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల కంటే ముందు అక్కడి రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ వర్గాల కొరకు నాలుగు శాతం విద్యా ఉద్యోగాలలో కొనసాగుతున్న ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లకు కూడా బిజెపి పార్టీ ప్రభుత్వ రద్దుపరిచి ఇతర వర్గాలకు రెండు రెండు శాతం రిజర్వేషన్లను కల్పించిన విషయం మీకు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అందుకే అక్కడ కొనసాగుతున్న బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పి అక్కడ కర్ణాటక రాష్ట్రంలో బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని ఉడగొట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అక్కడి ప్రజలు గెలిపించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అడగని వారికి కూడా అడుగక ముందే ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరిచిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కే పేరు దక్కిందని ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కొంతమంది పత్రిక విలేఖలు రెండవ శనివారం రోజు అడిగినందుకు ఈ విధముగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *