బల్మూర్ కి ప్రసంశల జల్లులు

బల్మూర్ వెంకట్ చిత్రపటానికి పాలాభిషేకం
కమలాపూర్, ఏప్రిల్ 9 (విశ్వం న్యూస్) : ఈరోజు కమలాపూర్ మండల కేంద్రంలో మొన్నటి పదవ తరగతి హిందీ పరీక్ష పేపర్ లీకేజీలో బి.ఆర్.ఎస్ మరియు బీజేపీ కలిసి ఆడిన నాటకంలో కమలాపూర్ మహాత్మా జ్యోతిరావు పూలే (MJP)పాఠశాలలో పదవతరగతి చదువుతున్న దామెర మండలం సీతారామపురానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన హరీష్ అనే విద్యార్థినినీ బలిపశువును చేసి మిగతా పరీక్షలు రాయకుండా ఐదు సంవత్సరాలు డిబార్ చేసినారు.
బీఆర్ఎస్ మరియు వారి కుట్ర కుతంత్రాల రాజకీయాలు చేస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొంటూ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీ నాయకులు కనీసం విద్యార్థి భవిష్యత్తు పట్టించుకోని క్రమంలో విద్యార్థి విషయం తెలుసుకొని స్పందించిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు నిరంతరం తెలంగాణ రాష్ట్రం లోని నిరుద్యోగ, విద్యార్థుల, ప్రజా సమస్యలపై పోరాడుతున్న డైనమిక్ లీడర్ శ్రీ బల్మూర్ వెంకట్ గారు విద్యార్థి ఇంటికి వెళ్ళి పరామర్శించి విద్యార్థికి న్యాయం చేస్తానని విద్యార్థి తల్లిదండ్రులకు మాట ఇచ్చిన సత్వరమే ఆలస్యం చెయ్యకుండా తెలంగాణ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి డిబార్ రద్దు చేయించి యదావిధిగా పరీక్షలు వ్రాసే విధంగా ఆర్డర్ ఇప్పించి విద్యార్థి భవిష్యత్తు కాపాడినాడు.ఈ విషయమై విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి వారి ఆనందానికి అవధులు లేవు బల్మూర్ వెంకట్ గారు చేసిన రుణం జీవితాంతం మరిచి పొలేమని కొనియాడి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ విషయం తెలిసిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు బల్మూర్ వెంకట్ గారిపై ప్రసంశల జల్లులు కురిపిస్తున్నారు. ఈ విషయం సందర్భంగా కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కమలాపూర్ మండల కేంద్రం బస్టాండ్ సెంటర్లో బల్మూర్ వెంకట్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.