రామప్పలో చిరు వ్యాపారులను ఆదుకోవాలి

రామప్పలో చిరు వ్యాపారులను ఆదుకోవాలి

కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే సీతక్క

ములుగు, (కలెక్టరేట్ ) డిసెంబర్ 31, (విశ్వం న్యూస్) : భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ రాక సందర్భంగా రామప్ప ఆలయ పరిసరాల్లో ఉన్న చిరు వ్యాపారులను తొలగించి వారి జీవనోపాధి దెబ్బతీశారని ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ధనసరి సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు శనివారం రామప్ప లోని చిరు వ్యాపారులతో కలిసి ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కు వినతిపత్రం అందజేసిన్నారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు ప్రభుత్వం వెంటనే ఉపాధి కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు ఈ విషయంలో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని కోరారు, వెంటనే స్పందించిన కలెక్టర్ వారం రోజుల్లోగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి దుకాణాలను పునఃప్రారంభించడానికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, వెంకటాపూర్ మండల అధ్యక్షులు చెన్నోజు సూర్యనారాయణ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్, గోవిందరావుపేట మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు నాగరాజు, పద్మయ్య, భిక్షపతి, రవి, రాజు, చంద్రమౌళి, పాషా, మోహన్ తదితర నాయకులు పాల్గొన్నారు.

రామప్ప చిరు వ్యాపారుల సమస్యల గురించి కలెక్టర్ కు వివరిస్తున్న ఎమ్మెల్యే సీతక్క

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *