ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఆయువు పట్టు

హైదరాబాద్:ఆరోగ్యానికి
చిరుధాన్యాలు ఆయువు పట్టు

తెలంగాణ ఎకనామిక్ ఫోరం & సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య
హైదరాబాద్, జూన్ 19 (విశ్వం న్యూస్) : సంపూర్ణ ఆరోగ్యానికి సమాజములో చిరుధాన్యాలు వినియోగం ఆయువు పట్టు అని తెలంగాణ ఎకనామిక్ ఫోరం & సామాజిక ఆర్థిక అద్యయన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య అన్నారు. నేడు స్థానిక రాజేంద్ర నగర్ డివిజన్ పరిధిలో గల అత్తాపూర్ కే కే ఆర్ అపార్టుమెంటులో కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ అద్వర్యములో కామధేనువు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మీల్లెట్స్ 2023 కార్యక్రమములో బాగంగా 400 మందికి ఉచిత మిలెట్స్ అల్పాహారం అందించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఎకనామిక్ ఫోరం & సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య మాట్లాడుతూ చిరుధాన్యాలు ఆహారంగా తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి వుక్తుల్లో ఉత్పాదక శక్తి సామర్ధ్యాలు పెరిగి జీవన ప్రమాణాలు పెరుగుతాయని చిరుధాన్యాలు పండించడం ద్వారా ప్రకృతి రక్షించ బడి ఆరోగ్య భారత అవతరిస్తుందని చిరుధాన్యాల వినియోగం జీవన శైలి లో భాగం చేసుకోవాలన్నారు అందరికీ ఆరోగ్యం. లక్ష్య సాధనలో పౌరసమాజం స్వచ్ఛంద సంస్థలు క్రియాశీల పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమములో కామధేను కన్వీనర్ టి అంజన్ కుమార్, స్థానిక బిజెపి బాధ్యులు కొమురయ్య, అపార్ట్ర్మేంట్ అసోసియేషన్ సభ్యులు ఎ’,బి’సిలాఫింగ్ క్లబ్ గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు వ్యవస్థాపకులు డాక్టర్ సీతారాం, డాక్టర్ భానుమతి, లాఫింగ్ క్లబ్ కన్వీనర్లు సుధాకర్ గుప్త, మహేందర్, సభ్యులు గోపాల్ రెడ్డి స్వామి, జనార్ధన్ రెడ్డి, శమంతకమణి సుజాత, అరుణ, విజయ శ్రీ తదితరులు హాజరయ్యారు.

“ఆహారమే ఔషధం” ‘మిల్లెట్లు ముద్దు ఆరోగ్యమే హద్దు” “వంటిల్లే ఔషధాలయం’ “ఇల్లాలే వైద్యురాలు” అన్న నినాదాలు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *