ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ నమాజ్

ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ నమాజ్

జమ్మికుంట పట్టణంలోని మాచనపల్లి గ్రామంలో మజీద్-ఈ-సలాఫియా (ఐలే హదీస్) కమిటీ ఆధ్వర్యంలో ఈద్-ఉల్-ఫితర్ నమాజ్
జమ్మికుంట, ఏప్రిల్ 23 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని అహిలే హదీస్ మసీదులో ముస్లిం మైనార్టీ నాయకులు అందరూ కలిసి మెలిసి ఈద్-ఉల్-ఫితర్ నమాజు మరియు ఒకరికి ఒకరు అలై బలై చేసుకొని రంజాన్ ముబారక్ ఒకరికి ఒకరు తీపి కబురు చెప్పుకున్నారు.

ఈ కార్యక్రమంలోని మజీద్ అధ్యక్షుడు మొహమ్మద్ రఫీ(వెల్డర్) మాట్లాడుతూ ఈ యొక్క రంజాన్ మాసం యొక్క ముఖ్య ఉద్దేశాలు వివరిస్తూ అల్లాహుతాలా ప్రతి ముస్లిం మీద నమాజ్ ఫరజ్ తర్వాత ఉపవాస దీక్ష ఈ యొక్క ఉపవాస దీక్షలో 30 రోజులు తప్పకుండా ఉండాలని ప్రతి ముస్లిం సోదరులకు సూచించారు.

మరియు ఈ యొక్క రంజాన్ మాసంలో మనం సంపాదించే సంపదలలో పేద ప్రజలకు కొంత దానం చేయాలి కఠినమైన ఉపవాస దీక్షలో ఉంటూ చెడు వినొద్దు చెడు చూడొద్దు. చెడు మాట్లాడొద్దు మరియు తప్పుడు పనులు చేయొద్దు ఈ యొక్క రంజాన్ అంశాలు వివరించారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ బాయ్, ముస్తఫా బాయ్, అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *