బండ్లగూడ జాగీర్ గంధం గూడలో
డ్రైనేజీ సమస్యకు పరిష్కారం

బండ్లగూడ జాగీర్, ఏప్రిల్ 21 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ పరిధిలో గంధం గూడ కేకేటు గేటు వద్ద డ్రైనేజీ నిండిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఈ సమస్యను కమిషనర్ గారికి నివేదించగా, ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తక్షణమే డ్రైనేజీ క్లియర్ చేయించడంతో ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ తలారి ప్రేమ్ కుమార్, స్థానిక మాజీ ఎంపిటిసి భోగాల శ్రీనివాస్ మదర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు సమస్యను త్వరితగతిన పరిష్కరించిన కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.వ్యక్తం చేశారు.