తాగునీటి సమస్యను పరిష్కరించండి
వాటర్ బోర్డు మేనేజర్ ని కోరిన
కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్
బండ్లగూడ జాగీర్, ఏప్రిల్ 24 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడ ఒకటో వార్డు బృందావన్ కాలనీలో తాగునీటి సమస్యలు తీర్చడానికి వాటర్ బోర్డు మేనేజర్ రాజరాజ నరేందర్ నాయక్ ని కలవడం జరిగింది. గత కొన్ని రోజులుగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని మంచినీరు లేక జనాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియ జేశారు.
వేసవికాలం మొదలు కావడంతో నీటి కష్టాలు ఎదుర్కొంటున్నామని కాలనీ వారు కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ ని కోరగా కాలనీ సభ్యులతో వాటర్ బోర్డ్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాటర్ బోర్డు మేనేజర్ మాట్లాడుతూ అతి త్వరలో పైప్ లైన్ జంక్షన్ చేయించి నీటిని అందే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, కమల్, శ్రీకాంత్, రఘు, తదితరులు పాల్గొన్నారు.