కేబినెట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

కేబినెట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగుల
సమస్యలను పరిష్కరించండి

  • తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం, సిఎస్ లకు విజ్ఞప్తి

హైదరాబాద్‌, మే 18 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఈనెల 18 వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ సెక్రటేరియట్లో నూతన సచివాలయములో మొదటి క్యాబినెట్ సమావేశం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన నాలుగు డిఏలు, పిఆర్సి నూతన కమిషన్ క్యాబినెట్ తో పాటు పిఆర్సి కమిషన్ను కూడా వెంటనే నియమించాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు, చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి ఐఏఎస్ తోపాటు క్యాబినెట్ మంత్రులకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రుల సమావేశం ఒక నిర్ణయం తీసుకుంటుంది కావచ్చని ప్రభుత్వ ఉద్యోగులందరూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు ఇస్తారు కావచ్చని, తెలంగాణ రాష్ట్రం ఉద్యోగులందరూ ఎదురుచూస్తున్నారని ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ ప్రభుత్వం కనుక ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు ప్రకటనలు చేస్తారు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *