ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

- మానకొండూరు ఎమ్మెల్యేకు వినతి
- ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రిప్రజెంటేషన్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

మానకొండూరు, ఫిబ్రవరి 25 (విశ్వం న్యూస్) : ఈ రోజు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ కు తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కలిసి 317 జీవో ద్వారా బదిలీ అయిన ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులను తిరిగి వారి వారి ప్రాంతానికి వెంటనే బదిలీ చర్యలు చేపట్టాలని మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణకు తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన మూడు డిఏలను వెంటనే మంజూరైనట్టు చర్యలు చేపట్టాలని ఈ సమస్యలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్లాలని, గత ప్రభుత్వం రెండవ పి ఆర్ సి లో ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, పెన్షనర్లకు 5% ఐఆర్ ఇస్తానని గత ముఖ్య మంత్రి హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు 20% ఐ ఆర్ వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్లకు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అవుతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగులకు మంజూరు చేయవలసిన మూడు డిఏలు 20% ఐ ఆర్ కొత్త జోన్లలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన ప్రమోషన్ల సీనియార్టీ లిస్టును కూడా వెంటనే చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని మానకొండూర్ ఎమ్మెల్యే ఎం సత్యనారాయణకు తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ శాలువా పుష్పగుచుముతో సన్మానించినారు.