జూన్‌ మొదటి వారంలో హైదరాబాద్‌కు సోనియాగాంధీ

జూన్‌ మొదటి వారంలో
హైదరాబాద్‌కు సోనియాగాంధీ

హైదరాబాద్, మే 12 (విశ్వం న్యూస్) : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ జూన్‌ మొదటి వారంలో హైదరాబాద్‌ రానున్నారు. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని పదెకరాల స్థలంలో పీసీసీ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన ‘గాంధీ ఐడియాలజీ సెంటర్‌’ భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి సోనియాతో పాటు రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర జాతీయ స్థాయి నాయకులను కూడా ఆహ్వానిస్తామని పీసీసీ వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *