త్వరలో ఉపాధ్యయుల పదోన్నతులు:
ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి

- ఎస్.ఎస్.సి 2023 లో వంద శాతం ఫలితాలు సాధించిన ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు,
- 10జిపిఎ సాధించిన విద్యార్థులకు సన్మానం
కరీంనగర్ బ్యూరో, మే 25 (విశ్వం న్యూస్) : గురువారం రోజు పిఆర్టి యు – టిఎస్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎస్ఎస్సి-2023 పరీక్ష ఫలితాల్లో వంద శాతం ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయులకు 10జిపిఎ సాధించిన జడ్పీ గవర్నమెంట్, టి ఎస్ ఎం ఎస్, కెజిబివి విద్యార్థులకు ప్రతిభాపురస్కార ప్రదానోత్సవ కార్యకమం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్సీ కూర రాఘోత్తం రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన హెచ్.ఎం లను, విద్యార్థులను ప్రశంసించారు. అలాగే మాట్లాడుతూ త్వరలో పదోన్నతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని జూన్ – 13 తర్వాత షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

కరీంనగర్ జిల్లలో 55 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించడం 29 మంది 10జిపిఎ సాధించడం అభినందనీయం అన్నారు. మరొక ముఖ్య అతిధి పిఆర్టియు – టిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిరెల్లి కమలాకర్ రావు మాట్లాడుతూ జూన్ 2 నుండి ఉద్యోగ ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో ఈహెచ్ఎస్ అమలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలియచేశారు. అలాగే జిల్లా అధ్యక్షులు ముస్కు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం లో ఉపాధ్యాయుల కొరత లేకుండా అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాలని లేనియెడల విద్యా వాలెంటర్లను నియామకం చేయాలన్నారు. జిల్లా ప్రధనకార్యదర్శి మర్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎస్.ఎస్.సి.2023 లో మన జిల్లా రాష్ట్రంలో నాలుగవ స్థానం రావడం జిల్లాలోని సమస్త ఉపాధ్యాయుల, విధ్యాధికారుల సమిష్టి కృషి ఫలితం అని తెలియ జేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా విద్యాధికారి సి హెచ్ జనార్థనరావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జిల్లా అంచెలంచెలుగా మొదటి స్థానం రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అసోసియేషన్, రాష్ట్ర అధ్యక్షులు రాజభాను ప్రకాష్ , పంచాయతీ రాజ్ మాస పత్రిక సంపాదక వర్గ సభ్యులు జాల మహేందర్ రెడ్డి, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కెవిఎన్ రెడ్డి, సిహెచ్ శ్రీకాంత రావు,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు, అన్నాడి మోహన్ రెడ్డి, ఎ.సునీత, జిల్లా అపాధ్యక్షులు వి.ఎల్.ఎన్, వి.రమాదేవి, కె.శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి, మండల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.