ఫిబ్రవరి 1న కేసీఆర్ విచారణ
నంది నగర్‌లో సిట్ హాజరు

హైదరాబాద్, జనవరి30, 2026 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు సిట్ అధికారులు మరోసారి సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద సాక్షిగా నోటీసులు జారీ చేశారు. సిట్ ఇచ్చిన నోటీసుల ప్రకారం, ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసంలో కేసీఆర్‌ను విచారించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఒకసారి నోటీసులు అందుకున్న నేపథ్యంలో, మరోసారి విచారణకు పిలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టూ రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతున్న వేళ, సిట్ తీసుకుంటున్న తాజా చర్యలు కేసుకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి. ఈ విచారణలో ఎలాంటి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తిగా మారింది.
ఈ పరిణామంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, అధికార పార్టీ రాజకీయ కక్షతోనే సిట్‌ను ఉపయోగిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, సిట్ విచారణపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

