అంగరంగ వైభవంగా శ్రీ పద్మావతీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం
తిమ్మాపూర్, పిబ్రవరి 24 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్
(ఎల్ఎండి)లోని శ్రీ ఆండాళ్ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం (44వ) అధ్యయన బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉ.వే. శ్రీమాన్ సముద్రాల పురు షోత్తమాచార్య స్వామి, శ్రీమాన్ గోవర్థన వేంకటాచార్యులు, గోవర్థన శ్రీకాంత్ ఆచార్యులు, అర్చకుల బృందం ఆధ్వర్యములో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా శ్రీ పద్మావతీ వేంక టేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవంను ఘనంగా నిర్వహించినట్లు శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయ నిర్వహణ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు.
శుక్రవారం ఉదయము శ్రీ మృత్యుంజయ మహాదేవ దేవాలయం నుండి సాంప్రదాయ ప్రకారం స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, శారే సమర్పించిన అనంతరం నూతన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాల అలంకరణతో కళ్యాణ మండపంలో అర్చకుల వేదమంత్రాలతో అంగరంగ వైభవంగా కన్నుల పండువగా శ్రీ పద్మావతీ వేంకటేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవంను ఘనంగా నిర్వహించారు.
అనంతరం సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ ఎంపీపీ కేతిరెడ్డి వనిత-దేవేందర్ రెడ్డి, మహాత్మానగర్ సర్పంచ్ జక్కాని శ్రీవాణి-రవీందర్, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కమిటీ చైర్మన్, టీఎన్జీవో నాయకులు మారం జగదీశ్వర్, శ్రీ మృత్యుంజయ మహా దేవాలయం ప్రధాన కార్యదర్శి, టీఎన్జీవో నాయకులు సంగేo లక్ష్మణరావు, ఇరిగేషన్,ఎస్సారెస్పీ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాలయ నిర్వహణ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల వేలాది మంది భక్తులు, తదితరులు పాల్గొన్నారు.