
- బన్నీవాసు కీలక నిర్ణయం!
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విశ్వం న్యూస్) : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం సికింద్రా బాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత రెండు నెలలుగా ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంటోన్న ఈ బాలుడి ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. అయితే శ్రీ తేజ్ త్వరగా కోలుకోవడానికి ఇంకా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు చెబుతున్నారు.

నిర్మాత బన్నీ వాస్ మరోసారి శ్రీతేజ్ ను పరామర్శించారు. ఆదివారం (ఫిబ్రవరి 02) సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వచ్చిన ఆయన శ్రీతేజ్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలుడి ఆరోగ్యం కుదుటపడుతోందని వైద్యులు చెప్పడంతో బన్నీవాసు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో శ్రీతేజ్‌కు ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు విదేశాలకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆస్పత్రి వైద్యుల సలహా మేరకు విదేశాలకు తీసుకుని వెళ్లాల్సి వస్తే.. అందుకు అయ్యే వైద్య ఖర్చులను తామే భరిస్తామని బన్నీ వాసు చెప్పినట్లు తెలుస్తోంది.