వైద్యులపై పోలీసుల
లాఠీఛార్జ్ పై తీవ్ర ఖండన
ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డా. రామ్ కిరణ్ పొలాస
తిమ్మాపూర్, మార్చి 25 (విశ్వం న్యూస్) : రాజస్థాన్ రాష్ట్రంలో ఇటీవల అక్కడి ప్రభుత్వం ఎన్నో లోటు పాట్లతో కూడిన ఆరోగ్య హక్కు చట్టంను అప్రజాస్వామికంగా ఆమోదింపజేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్న వైద్యులపై అక్కడి ప్రభుత్వం ప్రోద్బలంతో పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, వాటర్ కాన్ ప్రయోగాలతో జరిపిన దాడిని ఇండియన్ మెడికల్ అసోసి యేషన్ కరీంనగర్ జిల్లా శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు అధ్యక్షులు డా. రామ్ కిరణ్ పొలాస తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వైద్యులకు పూర్తి సానుభూతి, సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డా. రామ్ కిరణ్ పొలాస మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రంలో చేసిన ఆరోగ్య హక్కు చట్టంలో ఎన్నో లోటు పాట్లు ఉన్నాయని, ప్రస్తుత చట్టంలో అత్యవసర రోగుల చికిత్స విషయం లో ఎన్నో జవాబు లేని ప్రశ్నలు ఉన్నాయని, దీని వల్ల వైద్యులకు, చిన్న వైద్య శాలలకు ఆర్థిక భారంతో పాటు, రోగి బంధువులు నుండి రక్షణ కరువైతుందని అలాగే దీని వల్ల రోగులకు సరైన సమయంలో సరైన వైద్యం అందక పోవచ్చు అని, దీనితో రోగికి నష్టం, సమాజంలో అసహనం, శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, కాబట్టి వెంటనే ఈ చట్టం పై పూర్తి స్థాయిలో నిపుణులతో చర్చించిన తర్వాత మార్పులు చేర్పులుతో ప్రజలకు ఉపయోగపడేలా చట్టం రూపొందించాలని అపుడే అందరికి న్యాయం చేసే విధంగా ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో జాతీయ ఐయంఏ డిల్లీ నుండి వచ్చే ఆదేశాల ప్రకారంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని తెలిపారు.