STPపై తీవ్ర వ్యతిరేకత… MLA వెంటనే స్పందించాలంటూ విజ్ఞప్తి

గంధంగూడ, ఏప్రిల్ 1 (విశ్వం న్యూస్):గంధంగూడ సర్వే నం.86/2లో ప్రతిపాదిత మలిన జల శుద్ధి కేంద్రం (STP) ఏర్పాటుపై కెకె నగర్ ఫేజ్ 2, దత్తాత్రే కాలనీ, బృందవన కాలనీ, విఘ్నేశ్వర కాలనీలో ప్రతిపాదిస్తున్న ఎస్టీపీ (STP) నిర్మాణంపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ప్రాజెక్ట్ వల్ల భవిష్యత్తులో దుర్వాసన, కాలుష్యం, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కాలనీ వాసులు భయపడుతున్నారు. ఇది కేవలం ఒక అభివృద్ధి ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా… ప్రజల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తుతో ముడిపడిన కీలక అంశమని వారు పేర్కొంటున్నారు.

ఇతర ప్రాంతాల్లో STPల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, మన కాలనీలో కూడా అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. “ఇప్పుడే స్పందించకపోతే రేపు సమస్యలు తప్పవు” అని వారు హెచ్చరిస్తున్నారు.

👉 కాలనీ వాసులందరూ ఐక్యంగా నిలబడి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి
👉 STP నిర్మాణంపై పూర్తి వివరాలు వెల్లడించాలి
👉 ప్రజల అభిప్రాయంతోనే నిర్ణయం తీసుకోవాలి

ఈ నేపథ్యంలో స్థానికులు తమ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారిని వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ఆందోళనను పరిగణలోకి తీసుకుని STP ప్రాజెక్ట్‌పై సమగ్ర సమీక్ష చేపట్టి, ప్రజల ఆరోగ్యం మరియు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.
📢 “మన ఆరోగ్యం – మన హక్కు”
📢 “MLA గారు… మా గళం వినండి”
ప్రజల భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇదే అని కాలనీ వాసులు స్పష్టం చేస్తున్నారు.
