విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న స్వాతి వాగా నాయక్

విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ…
గోవిందరావుపేట డిసెంబర్ 28, (విశ్వం న్యూస్ ) : ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల కర్లపల్లి లో ఐ. టి. డి . ఏ, ఏటూరునాగారం ద్వారా స్వేటర్స్ మరియు దుప్పట్లను 3వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా స్థానిక సర్పంచ్ లావుడియా. స్వాతి వాగా హాజరై వారి చేతుల మీదుగా పంపిణి చేయడం జరిగింది. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు అన్ని రకాల వస్తువులు అందిస్తుందని ఆమె అన్నారు. విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థానంలో నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధానోపాధ్యాయులు కల్తీ. శ్రీనివాస్ ఉపాధ్యాయులు మరియు డిప్యూటీ వార్డెన్ . ఎట్టి. రాములు పాల్గొన్నారు.