నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోండి:కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్

నీటి సమస్యలు తలెత్తకుండా
చర్యలు తీసుకోండి:
కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్

బండ్లగూడ జాగీర్ (హైదరాబాద్), సెప్టెంబర్ 28 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటో వార్డులో మంచినీటి సమస్యపై జి ఎం మహేందర్ నాయక్ మరియు మేనేజర్ శ్రీనివాస్ గారితో చర్చలు జరిపారు. కొంతకాలంగా ఎదుర్కొంటున్న నీటి సమస్యపై వారిని చర్చించడంతో, బైరాగి గూడా గంధం గూడా వద్ద నిర్మించిన రెండు పెద్ద ట్యాంకులు నిండుగా ఉన్నప్పటికీ, నీరు అందించకపోవడం ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ విషయాన్ని విన్న జి ఎం మరియు మేనేజర్, వారం రోజుల్లో మంచినీటి సౌకర్యం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ సంఘటన ప్రజలందరికి సంతోషాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్, వెంకటేశ్వర కాలనీ ప్రెసిడెంట్ కృష్ణ సాగర్, మరియు రాములు, నాగిరెడ్డి, తిరుపతి నాయుడు, మన్నెం రవి, సైదులు, నరేందర్, వినయ్, ధనుంజయ్, గజానంద్, బాలరాజ్ మరియు ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *