తెలంగాణ ఉద్యమకారుడు గజ్జి మల్లికార్జున్ గుండెపోటుతో మృతి

గోవిందరావుపేట, జనవరి 8 (విశ్వం న్యూస్) : తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు గజ్జి మల్లికార్జున్ ఈరోజు గుండె పోటుతో మృతి చెందాడు. వయస్సు 45, భార్య ఇద్దరు పిల్లలు. ఆదివారం గోవిందరావుపేట మండలం పసర గ్రామంలో ఉదయం 10 గంటల సమయంలో గుండెపోటు రావడంతో అతనిని హుటాహుటిన అంబులెన్స్ లో ములుగు ఏరియా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఆసుపత్రిలో మృతి చెందినట్లు తెలిపారు. ఆయన మరణం పట్ల మండల ప్రజలు దిగ్బరాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ కాలంలో తన యావ జీవితాన్ని తెలంగాణ ఉద్యమం కోసం అంకితం చేశాడు పసరా గ్రామపంచాయతీ వార్డు సభ్యుడుగా పలు సందర్భాల్లో కొనసాగాడు గ్రామంలో ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారంగా పనిచేసేవాడు. తెలంగాణ వచ్చేవరకు పాదరక్షలు వేయకుండా తెలంగాణ కోసం పోరాటాలు నిర్వహించాడు తెలంగాణ లక్ష్యంగా ఎన్నో పోరాటాలు సొంత డబ్బులతో నిర్వహించాడు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని భావించాడు. కానీ అతనికి తెలంగాణ వచ్చిన తర్వాత అనేక ఆటుపోట్లను రాజకీయపరంగా ఎదుర్కొన్నాడు. యాక్సిడెంట్లో చెయ్యి విరిగి తెలంగాణ సంబరాల సందర్భంగా కంటికి గాయమై కోల్పోవాల్సి వచ్చింది. ఉద్యమంలో తనకున్న మూడు ఎకరాల భూమిని కోల్పోయాడు. కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని లక్ష్మి నరసింహ స్వామి గుట్టని మోకాళ్లపై ఎక్కి మొక్కులు తీర్చుకున్నాడు. తనకు పార్టీ సహాయం అందించాలని ముఖ్యమంత్రిని కలిసి పలు సందర్భాల్లో విన్నవించుకున్నాడు. ఎన్ని పోరాటాలు నిర్వహించిన అతనికి ప్రభుత్వం నివసించడానికి డబల్ బెడ్ రూమ్ గృహం కూడా ఇవ్వకపోవడం బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతని మరణంతో కుటుంబం వీధిలో పడ్డది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అతని కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.