పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ

పారిశ్రామిక పెట్టుబడులకు
స్వర్గధామం తెలంగాణ

కరీంనగర్ బ్యూరో, జూన్ 6 (విశ్వం న్యూస్) : తెలంగాణా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు పారిశ్రామిక ప్రగతి ‌కార్యక్రమం పద్మనాయకులు కళ్యాణ మండపం లో రాష్ట్ర ప్రభుత్వ అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ముఖ్య అతిథిగా హాజరైన కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత సురేష్, జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా, ఎస్పీ భాస్కర్, అడిషనల్ కలెక్టర్లు మకరంద, లత మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం లో కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో నేడు పరిశ్రమలకు టీ- ఎస్ ఐపాస్ తీసుకువచ్చి అన్ని అనుమతులు సులభతరం చేశారని కొనియాడారు. నాడు కరెంట్ కష్టాలతో పరిశ్రమలు మూతపడ్డాయని నేడు చాలా మందికి ఉపాధి అందచేస్తూ ప్రగతిలో ముందుకు సాగుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా నిలుస్తుందని తెలియచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *