ఉగ్రదాడులు.. గర్హనీయం..!

- జీటీఏ వరంగల్ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి ప్రకాష్ గౌడ్
- జిటిఏ ఆధ్వర్యంలో.. శాంతి ర్యాలీ..
- అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తులతో నివాళులు
హనుమకొండ, మే 1, (విశ్వం న్యూస్): భారతదేశంలో జరిగిన ఉగ్రదాడులు గర్హనీయమని.. ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం ( జిటిఏ) ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి ప్రకాష్ గౌడ్ తెలిపారు. జమ్ము కాశ్మీర్ లోని పెహల్గంలో హిందువులైన యాత్రికులపై జరిగిన హత్యాకాండను నిరసిస్తూ జిటిఏ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీని నిర్వహించారు. వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి ర్యాలీగా అదాలత్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని కొవ్వొత్తులతో తీవ్రవాదుల దాడుల్లో అమరులైన యాత్రికులకు నివాళులర్పించారు. భారత్ మాతాకీ జై.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా తాళ్లపల్లి ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. తీవ్రవాదుల దాడులను పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. మతం పేరుతో కల్లోలం సృష్టించే వారి పరంగా కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశ అభివృద్ధిని దెబ్బతీసే ఇటువంటి తీవ్రవాదుల దాడులను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా తెలిసి ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిటిఏ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గుజ్జా వెంకటేశం, వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు నరేంద్ర స్వామి, బిల్లా కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పబ్బోజు వీరాచారి, ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి, కోశాధికారి డి. రాములు, ఇతర బాధ్యులు ఆకోజు కిరణ్, కుర్సపల్లీ బిక్షపతి, అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.