ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చాలా బాధాకరం: మంత్రి శ్రీదేవి

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
మృతి చాలా బాధాకరం:మంత్రి శ్రీదేవి

హైదరాబాద్‌, జూన్ 8 (విశ్వం న్యూస్): బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతి పట్ల అధికార భాషా సంఘం మాజీ ఛైర్మన్ మంత్రి శ్రీదేవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటుగా పేర్కొన్నారు.

“గోపీనాథ్ గారు అత్యంత శాంత స్వభావంతో కూడిన ప్రజాప్రతినిధి. ప్రజలతో స్నేహభావంతో మమేకమై ఉండేవారు. యువతకు ఆదర్శంగా నిలిచారు. వారి మరణం ఎంతో బాధాకరం,” అని మంత్రి శ్రీదేవి అన్నారు. గోపీనాథ్ కుటుంబానికి ఆమె ప్రగాఢ సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *