కుసుమ జగదీష్, సాయి చంద్
కుటుంబాలకు 3కోట్లు:కేటీఆర్

- వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా సాయిచంద్ సతీమణి రజిని
- మీడియా సమావేశంలో ప్రకటించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్, జూలై 7 (విశ్వం న్యూస్) : కుసుమ జగదీష్ , సాయి చంద్ కుటుంబాలకు మూడు కోట్ల రూపాయలు అందచేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు వాళ్ల ఒక రోజు నెల జీతం ఇస్తారు. అన్ని కలిపి మూడు కోట్ల రూపాయలు అన్నారు.

సాయిచంద్ బార్య రజనీకి తెలంగాణ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒక్కో ఫ్యామిలీకి కోటిన్నర ఆర్థిక సాయం చేస్తున్నామని వెల్లడించారు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందన్నారు.